'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ లాంచ్
స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను `మహానటి` దర్శకుడు నాగి మరియు నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా...
మధుర శ్రీధర్ మాట్లాడుతూ ``ఇంట్రెస్టింగ్ టైటిల్. `మళ్ళీరావా`లాంటి మంచి చిత్రాన్ని నిర్మించి, అభిరుచి గల నిర్మాత అని పేరు తెచ్చుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమా నిర్మాత అంటే సినిమా ఏంటో అర్థం అవుతుంది. నవీన్ మంచి యాక్టర్. అతను నటిస్తున్న ఈ డిఫరెంట్ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ నాగి మాట్లాడుతూ ``నవీన్ నాకు `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రం నుంచి పరిచయం. తనలో మంచి నటుడు ఉన్నాడు. యూనిక్‌గా ప్రమోట్ చేస్తే సినిమాపై ఆటో మేటిక్‌గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి ప్రమోషన్స్‌తోనే వస్తున్నారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` టీమ్. ట్రైలర్‌లో కామెడీ, థ్రిల్లర్ కనిపిస్తున్నాయి. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నారని మాత్రం అర్ధం అవుతుంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుతున్నా`` అన్నారు.
చిత్ర దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ `` ఏజెంట్ అనే పదం పక్కన ఇంగ్లీష్ పేర్లతో ఉన్న టైటిల్స్ చాలా కనిపిస్తాయి మనకు. అందుకే ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు కన్విన్స్ అవలేదు. టైటిల్ డిజైన్ చేశాక కన్విన్స్ అయ్యారు. టైటిల్ లాగానే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడు. సినిమా చూశాక మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు`` అన్నారు.
నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ `` స్క్రిప్ట్ నన్ను ఆలోచింప చేసింది. టైటిల్ చూసి భయపడ్డాను. కానీ డిజైన్ చూశాక సర్‌ప్రైజ్ అయ్యాను. నవీన్ లాంటి నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నా సినిమాకు ప్రతిసారి కొత్త టాలెంట్‌లను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నా. అలానే ఈ చిత్రంతో నవీన్‌తో పాటు డైరెక్టర్ స్వరూప్ కూడా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` డిఫరెంట్ గా ఉండంతో పాటు ఆలోచింప చేస్తుందని నమ్మకంగా చెప్పగలను`` అని అన్నారు.
హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ``ను యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌తో అందరికీ సుపరిచితుడ్నే. ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా. నాకు చాలా స్పెషల్ మూమెంట్ ఇది. లండన్ లో ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలీవుడ్‌లో కొన్ని వెబ్ సీరీస్‌లు కూడా చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ఏడాది పాటు కష్టపడి తయారు చేసుకున్నాను. తర్వాత నిర్మాత రాహుల్‌గారిని కలిశాం. జూన్ 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఈ చిత్రం తప్పకుండా నవ్విస్తుందని చెప్పగలను`` అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్, సౌండ్ డిజైనర్ నాగార్జున్ తల్లపల్లి,పాటల రచయిత కృష్ణ కాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, రామ్ దూత్, సుహాస్, శ్రద్ధా రాజగోపాలన్, కృష్ణేశ్వర్ రావు, విశ్వనాథ్, ప్రశాంత్, సందీప్ రాజ్, విను వర్మ, అప్పాజీ అంబర్శ్ దర్భ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆడియోగ్రఫీ: అజిత్ అబ్రహామ్ జార్జి, మ్యూజిక్: మార్క్ రాబిన్, సౌండ్ డిజైన్: నాగార్జున్ తల్లపల్లి, లిరిక్స్: కృష్ణ కాంత్, సింగర్: అనురాగ్ కులకర్ణి, కాస్ట్యూమ్స్: మోనిక యాదవ్- వనజ యాదవ్, ఆర్ట్: క్రాంతి ప్రియం, ఎడిటర్-కో డైరెక్టర్: అమిత్ త్రిపాఠి, సినిమాటోగ్రఫీ: సన్నీ కృపాటి, స్క్రీన్ ప్లే: స్వరూప్- నవీన్ పొలిశెట్టి, ప్రొడ్యూసర్: రాహుల్ యాదవ్ నక్కా, స్టోరీ-డైలాగ్స్- డైరెక్షన్: స్వరూప్ ఆర్.ఎస్.జె.

0 Comments